పోలవరం ప్రాజెక్ట్ వివాదాలపై ఛత్తీస్గఢ్ ఒడిశా సీఎంలతో మాట్లాడతామన్న కేంద్ర మంత్రి పాటిల్
రిపోర్టర్: సునీల్
స్థలం: దిల్లీ
పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి ఛత్తీస్గఢ్, ఒడిశా ముఖ్యమంత్రులతో చర్చిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ఈ అంశంపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, ముంపు ప్రాంతాలు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి కీలక సమస్యలపై పొరుగు రాష్ట్రాల అధినేతలతో మాట్లాడి తగిన పరిష్కారం చూపుతామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.