టిబెట్‌లో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై ఏడు తీవ్రత నమోదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: టిబెట్
ఉత్తర టిబెట్‌లోని నాగ్చు ప్రాంతం కేంద్రంగా భారీ భూకంపం సంభవించినట్లు చైనా భూకంప నెట్వర్క్స్ సెంటర్ అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడుగా నమోదైందని పేర్కొన్నారు. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. ఈ వరుస భూకంపాలతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.