నూతన కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం: ప్రజల రక్షణలో మీదే కీలక పాత్ర
రిపోర్టర్: అశోక్
స్థలం: ఎన్టీఆర్
శాంతిభద్రతల పరిరక్షణలో నూతన కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని విజయవాడ సిపి ఎస్.వి. రాజశేఖర బాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కమిషనరేట్‌కు చేరుకున్న రెండు వందల ఇరవై ఏడు మంది కొత్త కానిస్టేబుళ్లకు కమాండ్ కంట్రోల్లో ఆయన దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతతో పాటు బాధితులు, మహిళల పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోరారు. అలాగే స్నిఫ్ఫర్ డాగ్స్ సేవలతో పోలీస్ శాఖ సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన వెల్లడించారు.