రూ.5 లక్షల కొత్త నోట్లతో లక్ష్మీ గణపతి అలంకరణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఖమ్మం
సత్తుపల్లి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి అలంకారంలో భక్తులకు గణనాథుడు దర్శనమిచ్చారు. ఉత్సవ కమిటీ సభ్యులు రూ.5 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అష్టలక్ష్మి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.