వినాయక నిమజ్జనానికి ప్రత్యేక ఆర్టీసీ వాహనాలు సిద్ధం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో వినాయక నిమజ్జన ఉత్సవాల కోసం ఆర్టీసి ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో మండపాల నుండి విగ్రహాలను తరలించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. లారీలు, ట్రక్కులు, ఆటోలు వంటి వివిధ వాహనాలకు అద్దెలను ఖరారు చేశారు. భక్తులు స్థానిక డిపోలను సంప్రదించి వాహనాలను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.