ముంబై ఇండియన్స్ జట్లతో నైకీ భారీ ఒప్పందం: అధికారిక కిట్ భాగస్వామిగా ఎంట్రీ
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
ముంబై ఇండియన్స్ పురుషుల, మహిళల జట్లకు అధికారిక కిట్ భాగస్వామిగా వ్యవహరించేందుకు ప్రముఖ స్పోర్ట్స్ వేర్ దిగ్గజం నైకీతో బహుళ సంవత్సరాల భారీ ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ స్పోర్ట్స్ హెడ్ దేవాంగ్ భీమ్జ్వాని తెలిపారు. 2027 సీజన్ నుంచి ఈ భాగస్వామ్యం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని, ఈ నెల నుంచే ఆటగాళ్లు నైకీ టీమ్ గేర్ ధరించడం ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ డీల్ పట్ల ఆటగాళ్లు, అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.