అమెజాన్ రిటర్న్ పాలసీని ఆసరాగా చేసుకుని లక్షల్లో మోసం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Mumbai

ముంబైకి చెందిన ఆన్‌లైన్ వ్యాపారిని అమెజాన్ రిటర్న్ పాలసీని దుర్వినియోగం చేస్తూ పదహారు లక్షలకు పైగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత ఐదేళ్లుగా వ్యాపారం చేస్తున్న అరవయ్యేళ్ల బాధితుడిని లక్ష్యంగా చేసుకుని నిందితులు అరవై రెండు ఖరీదైన గాడ్జెట్లను ఆర్డర్ చేసి వాటి స్థానంలో చెత్తను పెట్టి పూర్తి రీఫండ్ పొందారు.