వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు.. సీఐ నారాయణరావు హెచ్చరిక

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ, మండల పరిధిలో వినాయక చవితి సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్లకు ఎలాంటి అనుమతులు లేవని పట్టణ సీఐ కే నారాయణరావు స్పష్టం చేశారు. శుక్రవారం బొబ్బిలి పోలీస్ స్టేషన్లో డీజే యజమానులు, ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

డీజే సౌండ్స్ వల్ల కలిగే అనర్థాలపై వారికి అవగాహన కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు డీజే ఆపరేటర్లు, యజమానులు పాల్గొన్నారు.