వాతావరణ మార్పుల ప్రభావం: నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడాలని భట్టి పిలుపు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా నీటిని మరియు విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగం ఇరవై వేల మెగావాట్లు దాటుతోందని, సహజ వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.