నడిసంద్రంలో తీవ్ర భయం: 24 గంటల పాటు నూకల మీద బతికిన మత్స్యకారులు
రిపోర్టర్: గోపి
స్థలం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం నీలరేవు తీరంలో వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు నడిసంద్రంలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇంజిన్ వైఫల్యం మరియు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వారు ఇరవై నాలుగు గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. తోటి మత్స్యకారులు సోమవారం ఉదయం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి వారిని గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.