ది ప్యారడైజ్ సినిమాపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో దర్శకుడు సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ పంచుకున్నారు. సినిమాలో నాని పాత్ర అయిన జడల్ లుక్ తన బాల్యపు జ్ఞాపకాల నుంచి, చిన్నతనంలో తన తల్లి వేసిన జడల స్ఫూర్తితోనే రూపుదిద్దుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రం కేవలం తన బాల్యానికి ప్రతిరూపమే కాకుండా తన స్వర్గధామం అని పేర్కొంటూ, ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించాలని పిలుపునిచ్చారు.