హీరో నాని ప్యారడైజ్ మూవీ థియేటర్ విజ్ఞప్తిని నిరాకరించిన పోలీసులు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అనుమతివ్వాలని కోరిన అభ్యర్థనను హైదరాబాద్ సిటీ పోలీసులు తిరస్కరించారు. నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నందున శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.