పాకిస్థాన్ జలాల వాటాను అడ్డుకుంటే యుద్ధమేనంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా షెబాజ్ షరీఫ్ హెచ్చరిక
రిపోర్టర్: నరేష్
స్థలం: New York
పాకిస్థాన్ జలాల వాటాను నిలిపివేసే లేదా మళ్లించే ప్రయత్నాలను యుద్ధ చర్యగా భావిస్తామని ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ సమావేశంలో పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ హెచ్చరించినట్లు ANI వార్తా సంస్థ వెల్లడించింది. భారత్ ఎలాంటి పొరపాటు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఐరాస వేదికగా కశ్మీర్ తో పాటు పలు అంతర్జాతీయ అంశాలను ఆయన ప్రస్తావించారు. దౌత్యపరమైన చర్చలు, సరిహద్దు జల వివాదాలపై పాక్ వైఖరిని మరోసారి అంతర్జాతీయ వేదికపై ఆయన గట్టిగా వినిపించారు.