విద్యార్థులకు తీపి కబురు: మాతృభాషలో చదువుకునేందుకు బీహార్ సర్కార్ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: రమేష్
స్థలం: Patna
పాఠశాలల్ లో ప్రాంతీయ భాషలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టాలని బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి మరియు రెండు తరగతుల విద్యార్థులకు ఆరు ప్రాంతీయ భాషల్ లో బోధన ప్రారంభం కానుంది. మైథిలి, భోజ్పురి, బజ్జిక, మగహి, సుర్జాపురి మరియు అంగిక భాషలలో పుస్తకాలను సిద్ధం చేసేందుకు ఎస్ సీ ఈ ఆర్ టీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.