విమానాన్ని కూల్చేయబోయిన కోపైలట్ కుట్రను భగ్నం చేసిన భారత పైలట్

రిపోర్టర్: నరేష్ స్థలం: దుబాయ్

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళుతున్న విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్ దేశస్థుడైన కోపైలట్ చేసిన యత్నాన్ని భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ వీరోచితంగా అడ్డుకున్నట్లు విమానయాన వర్గాలు తెలిపాయి. గూఢచర్య కోణంలో సాగుతున్న ఈ ఘటనలో కోపైలట్ దాడి చేయడంతో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల సహకారంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.