అహంకారంతో ఎవరి అధికారం శాశ్వతం కాదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఉజ్జైని
ఉజ్జైనిలో జరిగిన యువ ధర్మ సంసద్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ అహంకారంతో ప్రతిదీ తమ ఇష్టప్రకారమే జరగాలనుకోవడం భ్రమ అని హెచ్చరించారు. ఎవరి అధికారం ఎప్పటికీ శాశ్వతంగా నిలవదని, సృష్టి నియమాలు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాహుల్ గాంధీ పర్యటనకు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.