ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన: రైతులతో ముఖాముఖి

రిపోర్టర్: రాజేష్ స్థలం: Prakasam

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. జరుగుమల్లి మండలంలో జరిగే పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే నర్సింగోలు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో రైతులకు భూ యాజమాన్య పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.