పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Eluru
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. జీ హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను వీక్షించిన నిపుణులు, గ్యాప్-1 మరియు గ్యాప్-2 ప్రాంతాల్లో జరుగుతున్న ప్రగతిపై అధికారులతో చర్చించారు. గతంలో చేసిన సూచనల అమలును పరిశీలించేందుకు ఈ బృందం ఈ నెల 17 వరకు పర్యటించనుందని అధికారులు వెల్లడించారు.