సారపాక గురుకుల హాస్టల్‌లో విద్యార్థినులపై ఎలుకల దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేసి కరవడం కలకలం రేపింది. రాత్రి వేళల్లో గదుల్లో సంచరిస్తూ ఎలుకలు గాయపరచడంతో విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు హాస్టల్‌ను సందర్శించి పారిశుధ్య లోపాలు, ఎలుకల బెడదపై విచారణ చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు.