తిమ్మాయపాలెంలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద గల శ్రీ దత్తగిరి నారాయణ తపోవన ఆశ్రమంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా చేపట్టారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆశ్రమ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, పెద్ద ఎత్తున భక్తులు హాజరై ప్రసాదం స్వీకరించారు.