జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రిపోర్టర్: సునీల్
స్థలం: నల్గొండ
ఇచ్చిన మాట ప్రకారం గుండెపోటుతో మృతి చెందిన ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబాన్ని ఆదుకున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే వెల్లడించారు. గతంలో బాధితుడి కుటుంబాన్ని స్వగ్రామంలో పరామర్శించి ఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా ఉంటానని హామీ ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.