వచ్చే ఏడాదిలో నంది అవార్డుల ప్రదానోత్సవం జరుపుతాం

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధమవుతున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరంలోనే అధికారికంగా నంది అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సైతం దీనికి అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. నంది నాటకోత్సవాలు జరిగే సమయంలోనే ఈ అవార్డులను అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా ఈ అవార్డులను ఇవ్వడం సాధ్యం కాదని, ఏపీ సొంతంగానే ఈ వేడుకను నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. అవార్డుల ఎంపిక కోసం త్వరలోనే ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.