ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్: రాష్ట్రంలో జిల్లా కేడర్గా టీచర్ల స్థానికత ఖరారు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల స్థానికత వివాదానికి తెరదించుతూ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు కింద సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లను జిల్లా కేడర్ ఉద్యోగులుగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో దాదాపు లక్షా డెబ్బై వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులలో స్పష్టత వచ్చిందని స్పష్టం చేశారు.