బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో స్నేహాన్ని తెంచుకున్న ఓరి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో తనకు ఉన్న స్నేహ బంధం తెగిపోయిందని ఇంటర్నెట్ సెలబ్రిటీ ఓరియన్ అవత్రామణి వెల్లడించారు. ఒక షోలో పాల్గొన్న ఆయన సారా, ఆమె తల్లి అమృత సింగ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్ట సమయంలో తాను అండగా నిలిచినా తనను విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంతోనే వారితో బంధాన్ని పూర్తిగా తెంచుకున్నట్లు ఓరి స్పష్టం చేశారు.