ఏపీలో నేడు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
రాష్ట్రవ్యాప్తంగా శనివారం మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నెల్లూరులో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.