ముంబైలో ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసానికి ఇజ్రాయెల్ ఘన నివాళి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ముంబై

ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కూల్చేయడానికి సహా పైలట్ చేసిన కుట్రను భగ్నం చేసిన ఫ్లైదుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని కొనియాడుతూ ముంబైలో ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ భారీ హోర్డింగ్లను ఏర్పాటు చేసింది. కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ భారత్కు కొత్త హీరో దొరికారని, ఇజ్రాయెల్ ఎప్పటికీ ఆయన పేరును మరువదని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సల్ జనరల్ యానివ్ రెవాచ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. 174 మంది ప్రాణాలను కాపాడిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.