స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు, పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ
రిపోర్టర్: హరి
స్థలం: India
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వ్యతిరేక సంకేతాలు, ఐటీ, మెటల్, మీడియా రంగాల షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ 443 పాయింట్లు నష్టపోయి 76,071 వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ 133 పాయింట్లు కోల్పోయి 23,764 వద్ద ముగిసింది. ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణ మార్కెట్లను పడగొట్టాయి.