తిరుమలలో ఘనంగా గరుడ సేవ భక్తులకు కఠిన ట్రాఫిక్ ఆంక్షలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడ సేవ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, టీటీడీ కఠిన ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో బైక్ల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.