ట్రంప్ ఘాటు హెచ్చరిక: ఆర్టిఫిషియల్ ఇంటೆలిజెన్స్లో అమెరికాయే నెంబర్ వన్!
రిపోర్టర్: రమేష్
స్థలం: World
చైనాతో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికాయే అగ్రస్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ అదే స్థానంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐ రంగంలో ఎవరైతే గెలుస్తారో వారే ప్రపంచాన్ని ఏలుతారన్నారు. తైవాన్‌కు ఆయుధాల విక్రయంపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జి జిన్‌పింగ్ అమెరికా పర్యటనను రద్దు చేసుకుంటామని బెదిరిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.