నిరుద్యోగులకు భారీ ఊరట: నెల రోజుల్లో డీఎస్సీ రెండు నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వచ్చే నెల రోజుల్లోగా డీఎస్సీ రెండు నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమరావతిలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే పదో తరగతి విద్యార్థుల కోసం మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.