కృష్ణా జలాల పిటిషన్ల విచారణ నవంబర్ నాల్గో తేదీకి వాయిదా

రిపోర్టర్: గోపి స్థలం: దిల్లీ

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభమైన సందర్భంగా, రాష్ట్రాలు ఎందుకు ఎప్పుడూ పోట్లాడుకుంటుంటాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, అన్ని పిటిషన్లను కలిపి వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.