తాటిపాముల గ్రామంలో రూ. ఏడు కోట్ల అభివృద్ధి పనులకు ఉత్తమ్ శంకుస్థాపన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో తన బాల్యం గడిచిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే వివిధ అభివృద్ధి పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. యశ్వంతపూర్ వాగుపై రూ. 16 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన చెక్డ్యామ్ కమ్ బ్రిడ్జి పనులతో పాటు, సీఎస్ఆర్ నిధులతో రూ. 7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామీణ విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.