ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ పనులకు వేగం పెంచిన కేంద్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయు}\తో సమావేశమయ్యారు. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటుకు రక్షణ శాఖ సానుకూలత వ్యక్తం చేసిందని, ప్రాజెక్టు వేగవంతం కోసం త్వరలో నోడల్ అధికారులను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.