ఎమ్సీడీ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న డిమాండ్ను అంగీకరించినట్లు Ministry of Labour & Employment, GoI వెల్లడించింది. కార్మిక సంఘాల మధ్య జరిగిన సయోధ్య చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏడవ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కనీస వేతన లెవెల్ ఒకటి కింద పద్దెనిమిది వేల రూపాయలతో పాటు వీడీఏ చెల్లించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా ఏటా నలభై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఆర్థిక భారం పడనుందని స్పష్టం చేసింది.