బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, మహిళ మృతి

రిపోర్టర్: రాము స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని మండ్య జిల్లాలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన పికప్ ట్రక్ కారును వెనుక నుంచి ఢీకొనడంతో సుధా జైన్ అనే 58 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.