కేసీఆర్ మౌనాన్ని ఛేదించేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలు

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరియు ప్రతిపక్ష నేత కేసీఆర్ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించేందుకు మరియు ఆయన మౌనాన్ని బద్దలు కొట్టేందుకు సీఎం రేవంత్ రకరకాల రాజకీయ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం దర్యాప్తుతో పాటు తాజాగా ఫాంహౌస్ భూముల వివాదంపై విచారణకు ఆదేశించడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.