గోల్డ్ స్పాట్ మూవీ: సరికొత్త ప్రేమకథతో పరిచయమే పాట విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

అభిషేక్, కాజల్ చౌదరి జంటగా వేణు కార్తికేయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోల్డ్ స్పాట్ చిత్రానికి సంబంధించి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా పరిచయమే అనే మధురమైన ప్రేమ పాటను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సున్నితమైన భావోద్వేగాలతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని దర్శకుడు తెలిపారు.