ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ హెలికాప్టర్ సర్వీసులు బంద్: ఆపరేటర్ల సంచలన నిర్ణయం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రా మార్గాల్ లో హెలికాప్టర్ సర్వీసులు నిలిచిపోనున్నట్లు ఆపరేటర్లు ప్రకటించారు. ప్రతి విమానంలోనూ ఇద్దరు పైలట్లు ఉండాలన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనను వ్యతిరేకిస్తూ సేవలను నిలిపివేస్తున్నట్లు ఆపరేటర్లు స్పష్టం చేశారు. ఈ ఆర్థిక భారాన్ని భరించలేమని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ డీజీసీఏకు వినతిపత్రం సమర్పించారు. భద్రతా ప్రమాణాల పేరుతో తెచ్చిన ఈ నిబంధన తమకు భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.