టెక్ మార్కెట్లో సంచలనం: ఒప్పో ఫైండ్ ఎక్స్ 10 ధరలు లీక్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ప్రముఖ టెక్ దిగ్గజం ఒప్పో నుంచి త్వరలో విడుదల కానున్న ఫైండ్ ఎక్స్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్ల ధరలు, రిటైల్ బాక్స్ వివరాలు ఆన్లైన్లో లీకయ్యాయని ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. భారతదేశంలో అక్టోబర్ 22న లాంచ్ కానున్న ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఫైండ్ ఎక్స్ 10 ప్రొ మాక్స్ గరిష్ట రిటైల్ ధర రూ. 2,39,999గా ఉండగా, స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1,79,999గా జాబితా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.