సెంట్రల్ ఢిల్లీలో అస్సాం మహిళా లాయర్పై భౌతిక దాడి

రిపోర్టర్: రమేష్ స్థలం: Delhi

సెంట్రల్ ఢిల్లీలోని ప్రసాద్ నగర్ ప్రాంతంలో ఆస్సాంకు చెందిన ఒక మహిళా లాయర్పై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఆస్తుల వివాదానికి సంబంధించి న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను పోలీసుల సమక్షంలోనే కొట్టారని, ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఢిల్లీకి రావడమేంటని దుండగులు ప్రశ్నించినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.