కాంగ్రెస్ పాలనలో భూకబ్జాలు, లూటీలు.. హరీష్ రావు ధ్వజమెత్తారు

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో భూకబ్జాలు, కుంభకోణాలు, లూటీలు పెరిగాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి శూన్యమని, రాష్ట్రం అవినీతిమయమైందని ఆయన మండిపడ్డారు.

బెల్లంపల్లి జాతీయ రహదారిపై పింఛన్ల హామీ అమలుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటవార్పు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు, కమిషన్లు వచ్చే పథకాలను మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు.