హైదరాబాద్‌లో ఏసీబీ దాడులు: జలమండలి జాయింట్ డైరెక్టర్ వద్ద నగదు సీజ్
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
హైదరాబాద్ జలమండలి జాయింట్ డైరెక్టర్ ఏ.శ్రీనివాస్ వద్ద లెక్కల్లో లేని నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. ఖైరతాబాద్‌లోని జలమండలిలో పనిచేస్తున్న ఆయన కారును శనివారం రాత్రి రాజ్ భవన్ రోడ్లో ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో రెండు లక్షల నలభై వేల రూపాయల అపరాధ నగదు లభించిందని, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పంచనామా నిర్వహించి ఆ సొమ్మును సీజ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.