గ్లోబల్ చెస్ లీగ్: కార్ల్సన్‌కు షాకిచ్చిన అలీరెజా ఫిరోజ్జా
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కర్ణాటక
బెంగళూరు వేదికగా జరుగుతున్న గ్లోబల్ చెస్ లీగ్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ ఆటగాడు అలీరెజా ఫిరోజ్జా చేతిలో కార్ల్సన్ పరాజయం పాలయ్యాడు. టోర్నమెంట్‌లో కార్ల్సన్‌కు ఇదే తొలి ఓటమి కావడం విశేషం. మరోవైపు అమెరికన్ గ్యాంబిట్స్ ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించగా, ఆదివారం జరిగే తుది పోరులో గంగెస్ గ్రాండ్‌మాస్టర్స్, ఏపీఎల్ పైపర్స్ తలపడనున్నాయి.