ఇజ్రాయెల్ జైళ్ల చుట్టూ మొసళ్ల కందకాలు.. భద్రత కోసం వినూత్న ప్రణాళిక!

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీల పారిపోవడాన్ని అడ్డుకునేందుకు అత్యంత కఠినమైన భద్రతా చర్యలకు తెరలేపింది. గరిష్ట భద్రతా విభాగాలుగా ఉన్న జైళ్ల చుట్టూ మొసళ్లతో నిండిన కందకాలను ఏర్పాటు చేయాలని జాతీయ భద్రతా మంత్రి ఇటామార్ బెన్-గ్విర్ ప్రతిపాదించారు. దీనికోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ మొసళ్ల చట్టాలను సవరించగా, ఇప్పటికే నెగెవ్ ఎడారిలోని కట్జియోట్ జైలులో కందకాలు తవ్వుతున్నట్లు సమాచారం.