కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో తీవ్రరూపం దాల్చిన టికెట్ రాజకీయం

రిపోర్టర్: కృష్ణ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్‌లో టికెట్ రాజకీయం తీవ్రరూపం దాల్చింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వద్దిరాజు రవిచంద్రకు సీటు దక్కదనే ప్రచారంతో కొత్త ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుటుంబం రాజకీయ ఎంట్రీకి సిద్ధమవుతుండగా, గ్రూప్ రాజకీయాలతో స్థానిక కేడర్ తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొంటోంది.