వాండే స్టేడియానికి మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించాలని బీసీసీఐని కోరిన ఎంసీఏ
రిపోర్టర్: సురేష్
స్థలం: ముంబై
ముంబైలోని ప్రసిద్ధ వాండే స్టేడియానికి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐని కోరింది. బీసీసీఐ నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎంసీఏ కార్యదర్శి ఉమేష్ ఖాన్విల్కర్ ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ లేఖ సమర్పించారు. వాంఖెడే స్టేడియం శాశ్వత టెస్ట్ సెంటర్‌గా ఉందని, దీనికి రాబోయే షెడ్యూళ్లలో ఎక్కువ మ్యాచ్‌లు ఇవ్వాలని, అలాగే ముంబై పరిధిలోని ఇతర వేదికలకు మ్యాచ్‌లు కేటాయించే ముందు తమకు సమాచారం అందించాలని వారు కోరారు.