విజయవాడలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాల క్రమబద్ధీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నగరంలో ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా వేలాది మంది పేదలకు శాశ్వత భద్రత మరియు సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించనున్నాయి. దశాబ్దాలుగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల కలలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ నెల ముప్పైవ తేదీన భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.