ప్రభుత్వమే కబ్జాకోరుగా మారింది: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Telangana
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జాకోరుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 22A నిబంధన పేరుతో సింగరేణిలో వేలాది ఇళ్లను, కాలనీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కష్టపడి ఇళ్లు కట్టుకున్న సామాన్యులను కబ్జాదారులుగా ముద్ర వేయడం దారుణమని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.