ఆత్మహత్యల నివారణకోసం బైక్ పై లక్షా నలభై వేల కిలోమీటర్ల ప్రయాణం.
రిపోర్టర్: నరేష్
స్థలం: NTR District
విజయవాడకు చెందిన వెంకట కార్తీక్ అనే యువకుడు 'నో సూసైడ్' నినాదంతో దేశవ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ యాత్ర చేపట్టాడు. ఏకంగా 599 రోజులపాటు సుదీర్ఘ ప్రయాణం చేసి లక్షా నలభై వేల కిలోమీటర్లు బైక్పై తిరిగాడు. ఆత్మహత్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలాంటి ప్రచారం ఆశించకుండా ఈ ప్రత్యేక యాత్రను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.