బీసీ రిజర్వేషన్ల హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న విజయ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించిందని ఆయన తెలిపారు. అట్టడుగున ఉన్న బీసీలను ముందుకు తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని, బీసీలు బానిసలుగా ఉండాలన్నదే వైఎస్ఆర్ సీపీ నేతల కుట్ర అని విజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.